సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రథమ స్థానంలో ఉందన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి. కమిషనరేట్ పరిధిలో మరిన్ని కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని ఆయన సూచించారు. ఫీర్జాదిగూడ మూడోవార్డు కార్పొరేటర్ శారద ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అరవై కెమెరాలను సీపీ మహేష్ భగవత్, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేయర్ జక్కా వెంకట్‌రెడ్డిలతో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.
మూడు నెలల్లో 100శాతం సీసీ కెమెరాలు.. - cc camera
రాచకొండ పరిధిలో మరో మూడు నెలల్లో వందశాతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు మంత్రి మల్లారెడ్డి. కార్పొరేటర్లు సీసీ కెమెరాల ఏర్పాటులో చొరవ తీసుకోవాలన్నారు.
మూడు నెలల్లో 100శాతం సీసీ కెమెరాలు..
ఫీర్జాదిగూడ కార్పొరేటర్లు 100% కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. మూడు నెలల్లోపు నగరపాలక సంస్థల్లో 100% సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు నగర మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి.
Last Updated : Feb 22, 2020, 3:24 PM IST