కార్గో సేవలను విస్తృతం చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ(Telangana RTC) కొన్ని బస్సులను పూర్తిస్థాయి లారీలుగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయోగాత్మకంగా పది బస్సులను ఓపెన్‌టాప్ లారీలుగా మార్చి సిమెంటుతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లను సైతం రవాణా చేస్తోంది. ప్రస్తుతం కార్గో సేవల(TSRTC Cargo Services) కోసం సంస్థ 185 బస్సులను వినియోగిస్తోంది. ఇటీవల పది బస్సులను ఓపెన్ టాప్ లారీలుగా మార్చి సరకు రవాణాకు అందుబాటులో ఉంచడంతో ఈ వాహనాల సంఖ్య 195కు చేరింది. ఆదరణ బాగుండడంతో మరో 50 కార్గో వాహనాల కొనుగోలుకు నిర్ణయించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Telangana Transport Minister Puvvada Ajay Kumar) ఇటీవల అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని ప్రకటించారు. కార్గో బుకింగ్స్ కోసం వచ్చే నెల నుంచి బస్ డిపోలు, బుకింగ్ ఏజెంట్లకు టికెట్ జారీ యంత్రాలను అందించనున్నారు. ఇకపై రాష్ట్రంలోని సుమారు 37 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా ఆర్టీసీ కార్గో(Telangana RTC Cargo) ద్వారా బియ్యం, విజయా నూనె, ఇతర ఉత్పత్తులను అందజేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది.
TSRTC CARGO SERVICES : కార్గో కోసం ఆ ఆర్టీసీ బస్సులే లారీలిక!
కరోనా వ్యాప్తి, లాక్డౌన్ వల్ల నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకురావడానికి రాష్ట్ర రవాణా శాఖ(Telangana Transport Ministry) అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అదనపు ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రవేశపెట్టిన కార్గో, పార్శిల్(TSRTC CARGO SERVICES) సేవలు కొంతమేరకు ఆదాయన్ని సమకూరుస్తున్నాయి. ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ మరో కొత్త అడుగు వేసింది. కార్గో సేవల(TSRTC CARGO SERVICES) కోసం కొన్ని బస్సులను లారీగా మార్చి అందుబాటులోకి తీసుకువచ్చింది.
కార్గో సేవల కోసం బస్సులను లారీలుగా మార్చిన ఆర్టీసీ
అసెంబ్లీలో కార్గో, పార్శిల్ సేవల గురించి మంత్రి పువ్వాడ ఏమన్నారంటే..