Omicron Cases in Andhra pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదు - తెలంగాణ వార్తలు
15:28 December 29
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదు
Omicron Cases in Andhra pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్... క్రమంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు రావడం కలకలం రేపుతోంది. ఈ కొత్త కేసులతో కలిపి ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కి చేరింది. అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు, యూఏఈ నుంచి వచ్చిన మరో ఇద్దరు, నైజీరియా, కువైట్, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒక్కొక్కరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
కువైట్, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్ నిర్ధరణ అయినట్టు ఏపీ వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు రాగా.. అనంతపురం జిల్లాలో రెండు, కర్నూలు రెండు కేసులను గుర్తించినట్లు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు తెలిపారు. ప్రస్తుతం బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు.
ఇదీ చదవండి:Boyapati On Ongole Bulls: 'అందుకే ఆ ఎద్దులను 'అఖండ'లో చూపించాను'