మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరేడ్మెట్ పీఎస్ పరిధిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచిన గోడౌన్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి... భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. వీటి విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వినాయకనగర్‌కు చెందిన నిరంజన్ అనే వ్యక్తి కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడిపిస్తున్నాడని పేర్కొన్నారు.
గుట్కా ప్యాకెట్ల స్వాధీనం... వ్యక్తి అరెస్ట్ - Medchul_Malkajigiri district neredmet policestation
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. జిల్లాలోని నేరేడ్మెట్ పీఎస్ పరిధిలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు.
![గుట్కా ప్యాకెట్ల స్వాధీనం... వ్యక్తి అరెస్ట్ GUTKA PACKETS SEIZED](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5913418-326-5913418-1580486729387.jpg)
GUTKA PACKETS SEIZED
అక్రమ సంపాదనకు అలవాటు పడిన అతను కిరాణ దుకాణం ముసుగులో ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నాడని చెప్పారు. ఇదివరకే ఎన్నోసార్లు ఇటువంటి కేసులో ఎస్ఓటీ పోలీసులకు చిక్కినా బుద్ధి మారలేదని పోలీసులు అన్నారు.
రూ. 10 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ఇదీ చూడండి :ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..