శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 4,21,748 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 5,90,793 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులు ఉండగా... నీటి నిల్వ 210.0320 టీఎంసీలుగా ఉంది. 10 గేట్లను 25 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి వరద ప్రవాహం... 10 గేట్లు ఎత్తివేత - srisailam water capacity updates
శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 884 అడగులకు చేరగా.. నీటి నిల్వ 210.03 టీఎంసీలుగా ఉంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టులో 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
శ్రీశైలానికి వరద ప్రవాహం... 10 గేట్లు ఎత్తివేత
ఎగువ నుంచి వస్తున్న వరదలతో పులిచింతల జలాశయానికి వరద ప్రవహం కొనసాగుతోంది. 5.77 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... 17 గేట్ల ద్వారా 5.58 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 44.79 టీఎంసీలు ఉండగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 45.77 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 174.37 అడుగులకు చేరింది.
ఇదీ చదవండి :తెలంగాణలో మరో 1,378 కరోనా కేసులు, 7 మరణాలు