రాష్ట్రాలకు రెమ్డెసివిర్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణకు 1.45 లక్షల రెమ్డెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సరఫరా సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి 2.35 లక్షల ఇంజక్షన్ల సరఫరా చేయాలని సూచించింది.
రాష్ట్రానికి 1.45 లక్షల రెమ్డెసివిర్ ఇంజక్షన్లు - remdesivr injections to telangana
తెలంగాణకు 1.45 లక్షల రెమ్డెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సరఫరా సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జాబితా ప్రకారం రాష్ట్రాలకు ఇంజక్షన్లు అందించాలని సూచించింది. ఈనెల 16 వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
రెమ్డెసివిర్, తెలంగాణకు రెమ్డెసివిర్, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు
తెలంగాణకు 45వేల రెమ్డెసివిర్ ఇంజక్షన్లు మైలాన్ సంస్థ సరఫరా చేయనుండగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నుంచి 11,200 ఇంజక్షన్లు రానున్నాయి. షిన్జిన్-సన్ సంస్థ నుంచి 2వేలు, జుబిలియంట్ నుంచి 500 ఇంజక్షన్లు రాష్ట్రానికి సరఫరా చేయాలని ఆయా సంస్థలను కేంద్రం ఆదేశించింది.
- ఇదీ చదవండి :'భారత్లో 'స్పుత్నిక్ లైట్' పరీక్షలు జరుపుతాం'