కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా హైదరాబాద్ నగరానికి చేసిందేమీలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అల్విన్ కాలనీలో నిర్వహించిన రోడ్‌షోలో ప్రధానిపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ యాగాలు చేస్తే మోదీకి ఎందుకు భయమని ప్రశ్నించారు. వ్యక్తిగత కార్యక్రమాలను రాజకీయం చేసి భాజపా నేతలు పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్‌కు రోజు దేవుడు గుర్తుకు వస్తే, మోదీకి మాత్రం ఎన్నికలప్పుడే గుర్తుకోస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఎన్నికలు రాగానే భాజపా నేతలకు మసీద్, మందిర్ గుర్తుకొస్తాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం భారత్-పాక్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ వేషం మారింది కానీ దేశం మారలేదన్నారు. చాయ్‌వాలా నుంచి ప్రమోషన్ పొందిన మోదీ ఇప్పుడు చౌకీదార్ అంటున్నారని, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ టేకేదార్ అంటున్నాడని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ యాగాలు చేస్తే మోదీకి ఎందుకు భయం - trs working president ktr fires on pm modi
ఐదేళ్లు అధికారంలో ఉన్న భాజపా హైదరాబాద్‌కు చేసిందేమీలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ యాగాలు చేస్తే మోదీకి ఎందుకు భయమేస్తోందని ప్రశ్నించారు. శేరిలింగంపల్లిలోని అల్విన్ కాలనీలో నిర్వహించిన రోడ్‌షోలో భాజపాపై ధ్వజమెత్తారు.
శేరిలింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో కేటీఆర్ రోడ్‌షో
ఇవీ చూడండి:'నన్ను గద్దె దించేందుకు ఎంతకైనా దిగజారుతారు'
TAGGED:
2018 elections