తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆ యాప్​లోనే అంతా' - cyberabad

ఐటీ గ్రిడ్ కేసులో అశోక్​ను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్​ స్పష్టం చేశారు. ఈ కేసుపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్​

By

Published : Mar 4, 2019, 4:51 PM IST

ఏపీ ప్రజల వ్యక్తిగత, సునిశిత సమాచారాన్ని ఐటీ గ్రిడ్‌ భద్రపరిచినట్లు గుర్తించామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సేవా మిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారన్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ సంస్థపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. కేసులో మరింత సమాచారం కోసం ఆధార్‌ సంస్థ, ఈసీకి లేఖ రాస్తామన్నారు. ఓట్ల తొలగింపుపై ఏపీలో 50 కేసుల వరకు నమోదయ్యాయన్నారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్​

ABOUT THE AUTHOR

...view details