2022 నాటికి 40 గిగావాట్ల సౌరవిద్యుతే లక్ష్యం... - solar
ఎస్బీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్‌లో సోలార్ విద్యుత్‌పై అవగాహాన కార్యక్రమం జరిగింది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రుణసదుపాయం కల్పిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు.
గత ఐదు సంవత్సరాల్లో సోలార్ ప్యానల్ ఖర్చు 70 శాతానికి తగ్గిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్‌లో సోలార్ విద్యుత్‌పై అవగాహాన కార్యక్రమం జరిగింది. 2022 నాటికి 40 గిగావాట్లని ఉత్పత్తి చేయడమే భారత ప్రభుత్వ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్యపరమైన భవనాలపై సౌర ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకోవడానికి ఎస్బీఐ రుణ సదుపాయాన్ని కల్పిస్తుందని తెలిపారు. రుణ సదుపాయం నేరుగా యజమానులకు, మూడవ పార్టీకి లభిస్తుందని అన్నారు. ఎస్బీఐ వివిధ సంస్థలతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించిందని, ప్రత్యేకంగా సోలార్ వినియోగం పెరిగేలా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే అవగాహాన కార్యక్రమాలు పూర్తి చేసినట్లు నిర్వాహుకులు పేర్కొన్నారు.