ETV Bharat / city
'కేసులకు భయపడను' - revanth fires on kcr
కేసీఆర్ పతనమే తెలంగాణ ప్రజల విజయమన్నారు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి. శాసనసభ ఎన్నికలప్పుడు ఐటీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈడీని ప్రయోగించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విమర్శించారు.
కేసులకు భయపడను: రేవంత్
By
Published : Feb 20, 2019, 6:04 AM IST
| Updated : Feb 20, 2019, 9:20 AM IST
ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి మోదీ విచారణ సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటలపాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరి కొన్ని అంశాలపై స్పష్టత కోసం ఇవాళ కూడా విచారించనున్నట్లు రేవంత్ తెలిపారు. తనపై పెట్టిన అక్రమ కేసులకు భయపడేదే లేదని.. తల తెగి పడినా కేసీఆర్‌పై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
Last Updated : Feb 20, 2019, 9:20 AM IST