క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్ సిటీలో మూడు రోజుల పాటు జరిగిన ప్రాపర్టీ షో ముగిసింది. ముగింపు వేడుకలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ప్రాపర్టీ షో అద్భుతంగా జరిగిందని నగర మేయర్ తెలిపారు. హైదరాబాద్లో యాభై లక్షల జనాభా పెరిగిన నీటి సమస్య రాకుండా చేశామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడిందని స్టాల్స్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.