తెలంగాణ

telangana

ETV Bharat / city

'మోదీ హవా లేదు, రాహుల్​కు ఆదరణ లేదు' - ktr on modi

మోదీకి హవా లేదు... రాహుల్​కు ఆదరణ లేదని కేటీఆర్ అన్నారు. భాజపా, కాంగ్రెస్ రెండూ కలిసినా... అధికారంలోకి రాలేవన్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినా అభ్యంతరం లేదు... తమ ప్రాజెక్టులకూ నిధులు ఇవ్వాలని కోరారు. 16ఎంపీలు గెలిచి ఎర్రకోటపై ఎవరు జెండా ఎగరవేయాలో నిర్ణయిస్తామన్నారు.

సికింద్రాబాద్ గడ్డ మీద తెరాస జెండా ఎగురుతుంది

By

Published : Mar 13, 2019, 8:11 PM IST

సికింద్రాబాద్ గడ్డ మీద తెరాస జెండా ఎగురుతుంది
ఇద్దరు ఎంపీలతో ప్రత్యేక తెలంగాణను సాధించిన కేసీఆర్ 16ఎంపీలను గెలిపిస్తే ప్రాజెక్టులకు జాతీయ హోదా తెస్తారని కేటీఆర్ అన్నారు. జహీరాబాద్ తెరాస సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2014లో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన భాజపా ఈసారి 150 కూడా గెలిచేలా లేదన్నారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకోలేదని ఎద్దేవా చేశారు.

గ్రేటర్ హైదరాబాద్, అసెంబ్లీ ఎన్నికల్లాగే భాజపాను ఓడగొడతామని సికింద్రాబాద్​ సన్నాహక సభలో అన్నారు కేటీఆర్. సికింద్రాబాద్ గడ్డ మీద తెరాస జెండా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏం చేశారని ఓట్లడగడానికి వస్తున్నారంటూ కమల దళాన్ని నిలదీశారు. రాష్ట్రానికి కనీస ప్రాతినిధ్యం ఇవ్వలేదని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలు మోదీకి, రాహుల్​కు మధ్యేనని కాంగ్రెస్ అనడం సిగ్గు చేటన్నారు.

ఏదీ ఏమైనా... 16 స్థానాలు గెలిచి తెంలగాణ అభివృద్ధి కోసం పేగులు తెగేదాకా కొట్లాడతామని హామీ ఇచ్చారు. ఎర్రకోటపై ఎవరు జెండా ఎగరవేయాలో నిర్ణయించేది తెలంగాణ గల్లీల్లోనే అని తేల్చిచెప్పారు.

ఇవీ చూడండి:అయితే భోఫోర్స్ లేకుంటే రఫేలా?

ABOUT THE AUTHOR

...view details