ETV Bharat / city
పోస్తే చాలు నీళ్లక్కర లేదు - water less toilets in Hyderabad metro stations
శౌచాలయానికి వెళ్లిన తర్వాత నీళ్లు పోయకపోతే వచ్చే దుర్గంధాన్ని భరించలేం... కానీ ఈ పబ్లిక్ టాయిలెట్లలో విసర్జించిన తర్వాత నీళ్లు పోయకున్నా ఎలాంటి వాసనా రాదు.. ఇది మరెక్కడో లేవు...మన హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో కొలువుదీరాయి.
కోటానుకోట్ల లీటర్ల నీటి వృధాను అరికట్టే ఆలోచన
By
Published : Feb 15, 2019, 8:51 PM IST
| Updated : Feb 16, 2019, 11:05 AM IST
హైడ్రోఫోబిక్ మెటీరియల్తో తయారు చేసిన టాయిలెట్లు మనం ఒక మూత్రశాలను శుభ్రం చేయడానికి ఏటా లక్షా యాభైవేల లీటర్ల నీటిని వినియోగిస్తున్నాం. అంటే కోట్లాది మంది ప్రజలు ఎంత నీటిని వాడుతున్నారో కనీసం ఊహించలేం. ఈ కోటానుకోట్ల లీటర్ల నీటి వృథాను అరికట్టే ఆలోచన చేశాడు హైదరాబాద్‌కు చెందిన భూపతి. ప్లాస్టిక్ పరిశ్రమలో నిపుణుడైన భూపతి నాలుగేళ్ల శ్రమ ఫలితమే ఈ నీరు అవసరం లేని టాయిలెట్లు. ఈ పర్యావరణహిత మూత్రశాల ద్వారా ఏటా ఒక్కదానిపై లక్షా యాభై వేల లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు. అంటే ఈ ఆదాతో సంవత్సరానికి 150 మందికి తాగునీటి కష్టాలు తీర్చొచ్చు అంటున్నారు భూపతి. హైడ్రోఫోబిక్ మెటీరియల్తో తయారు చేసిన ఈ టాయిలెట్లు నీటిని మూత్రంతో కలవనీయకుండా చేస్తుంది. నీరు కలిసినప్పుడు మాత్రమే దుర్వాసన వెలువడుతుందని ఆయన అంటున్నారు. ఈ ఆధునాతన మూత్రశాలలను మెట్రో స్టేషన్‌ల వద్ద ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ మెట్రోతో భూపతి ఒప్పందం కుదుర్చుకున్నారు. మియాపూర్, నాగోల్ మెట్రో కారిడార్‌లో 37 మూత్రశాలలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పురుషులకే పరిమితమైన ఈ మూత్రశాలలు త్వరలో స్త్రీలకూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. Last Updated : Feb 16, 2019, 11:05 AM IST