వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస బలపరిచిన ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని గౌడ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ రావ్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడ కులస్తులకు చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమయ్యామన్నారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ నగరంలో కల్లు దుకాణాలు మూత పడటం వల్ల వేలాదిమంది గీత కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కల్లు దుకాణాలను తెరిపించి జీవనోపాధి కల్పించారని గుర్తు చేశారు.
తెరాసకు మద్దతు ప్రకటించిన తెలంగాణ గౌడ సంఘం - parliament
పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసకు తెలంగాణ గౌడ సంఘం మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లు గీత కార్మికులను ఆదుకున్నారని సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌రావ్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తోందని అందుకే తెరాసకు మద్దతు ప్రకటించామని స్పష్టం చేశారు.
తెరాసకు మద్దతు