జీహెచ్ఎంసీకి మరో అవార్డు - RAVISHANKAR PRASAD
జీహెచ్ఎంసీని మరో అవార్డు వరించింది. కేంద్రం డిజిటల్ ఇండియా పేరుతో గుర్తింపునిచ్చింది. సాంకేతికత వినియోగం, మెరుగైన సేవలు కారణాలుగా ప్రశసించనుంది.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థను మరో అవార్డు వరించింది. జీహెచ్ఎంసీ సాంకేతికతను విస్తృతంగా వినియోగించడం, పట్టణ పౌరులకు మెరుగైన సేవలు అందించడం వల్ల కేంద్రం డిజిటల్ ఇండియా గుర్తింపునిచ్చింది. ఈ- ఆఫీస్, మై జీహెచ్ఎంసీ యాప్లతో లక్షల సమస్యలు పరిష్కారం అయ్యాయి. దేశంలో ఈ యాప్ను 7 లక్షల మంది ఉపయోగిస్తున్నారు. నగర పాలక సంస్థకు ఈ అవార్డు రావడం పట్ల మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ దిల్లీలో రేపు ఈ అవార్డును అందించనున్నారు.