హైదరాబాద్ గోల్నాకలోని ఓ కుటిర పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కూలర్లకు ఉపయోగించే గడ్డిని తయారు చేసే కుటీర పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. కూలర్లకు సంబంధించిన సామగ్రి కాలిబూడిదైంది. ప్రమాదానికి గల కారణాలపై అంబర్‌పేట పోలీసులు విచారణ చేపట్టారు.
కుటీర పరిశ్రమలో అగ్నిప్రమాదం