తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్ల వర్క్​షాప్​లో అగ్ని ప్రమాదం - short circuit

రాణిగంజ్​లోని ఓ వర్క్​షాప్​లో షార్ట్​సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయి.  వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు.

అగ్నిప్రమాదం

By

Published : Apr 13, 2019, 5:40 AM IST

సికింద్రాబాద్ రాణిగంజ్ వద్ద ఉన్న సాబూ కార్ల వర్క్ షాప్​లో శుక్రవారం రాత్రి షార్ట్ సర్కూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. అందులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వర్క్ షాప్​లో ఉన్న సామగ్రి, కంప్యూటర్లు, కొన్ని ఫైల్స్ దగ్ధం అయ్యాయి. ఎవరికి ప్రాణాపాయం జరగలేదని అగ్నిమాపక అధికారి తెలిపారు.

అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details