తెలంగాణ

telangana

ETV Bharat / city

మందుబాబులపై కేసులు

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో  ట్రాఫిక్​ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 78 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్​లో ట్రాఫిక్​ పోలీసులు తనిఖీలు

By

Published : Feb 10, 2019, 5:08 AM IST

హైదరాబాద్​లో ట్రాఫిక్​ పోలీసులు తనిఖీలు
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాత్రి 11 గంటల నుంచి రెండు గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో 78 మంది మందు బాబులపై కేసులు నమోదు చేశారు. 50 కార్లు, 28 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనదారులు తప్పించుకొనేందుకు యత్నించగా... పోలీసులు వెంబడించిన పట్టుకున్నారు. కేసులు నమోదు చేసిన వారికి సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించి మంగళవారం కోర్టులో హజరుపర్చనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details