తెలంగాణ

telangana

ETV Bharat / city

గంజాయి 'గుట్టు' రట్టు - malkajgiri police

రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న 83 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

78 కిలోల గంజాయి స్వాధీనం

By

Published : Mar 1, 2019, 4:30 PM IST

78 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖ జిల్లా పాడేరు నుంచి హైదరాబాద్​కు తరలిస్తున్న గంజాయిని ముందస్తు సమాచారం మేరకు మల్కాజిగిరి ఎక్సైజ్​ పోలీసులు పట్టుకున్నారు.ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 12 లక్షల రూపాయల విలువ చేసే 78 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్​తో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని మల్కాజి​గిరి ఎక్సైజ్​ అధికారి ప్రదీప్​ రావు తెలిపారు.

మరోవైపు మంచిర్యాల జిల్లా మందమర్రిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర్నుంచి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని మందమర్రి సీఐ రామచందర్​రావు తెలిపారు.

ఇవీ చూడండి:పాక్ కుర్చీ ఖాళీ

ABOUT THE AUTHOR

...view details