తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్నికల వేళ రోజువారి కూలీలకు పెరిగిన డిమాండ్​

ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇదే కొందరికి ఉపాధి మార్గం అయింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా జెండాల తయారీదారులు, డప్పు కళాకారులు, బహిరంగ సభల్లో గాయకులు, నృత్య కళాకారులకు నాలుగు రూపాయలు తెచ్చిపెడుతోంది.

By

Published : Mar 20, 2019, 5:37 PM IST

Updated : Mar 20, 2019, 6:02 PM IST

కళాకారులకు క్రేజ్​...

కళాకారులకు క్రేజ్​...
సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని రోజువారి కూలీలకు డిమాండ్‌ పెరిగింది. పొద్దంతా చెమటోడిస్తే వచ్చే దినసరి వేతనం కన్నా అభ్యర్థుల వెంట కొంత సేపు ప్రచారం చేస్తే వచ్చే సొమ్మే ఎక్కువగా ఉంది. వీటితో పాటు మధ్యాహ్నం భోజనం కూడా దొరుకుతున్నందున ఎన్నికల ప్రచారానికే 'జై' కొడుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలుతమ ప్రచారానికి కావాల్సిన వారిని ముందస్తుగా బుక్‌ చేసుకుంటున్నారు. రోజుకి రూ. 500 నుంచి 700 వరకు చెల్లిస్తున్నారు.

కళాకారులకుక్రేజ్​...


ఎన్నికల ప్రచారంలో కళాకారులది కీలక పాత్ర. గొంతెత్తి వీరు పాడే పాటలే ప్రచారానికి వన్నె తెస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కళాకారులు తక్కువ సంఖ్యలో ఉన్నందునఅభ్యర్థులకు దొరకడమే కష్టంగా మారింది. వారిని వెతికి పట్టుకునే పనిలో పడ్డాయి పార్టీలు. మిగతా సమయాల్లో ఖాళీగా ఉండే కళాకారుల బృందాలు ఇప్పుడు బిజీబిజీగా మారి డబ్బులు సంపాదించుకుంటున్నాయి.


జెండాల తయారీదారులకు లక్ష్మీకళ

ఎన్నికల ప్రచారాల్లో ఫ్లెక్సీలు వినియోగించరాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ ప్రభావం ఫ్లెక్సీ తయారీ కేంద్రాలపై పడింది. వీటి స్థానంలో ఇప్పుడు జెండాలు రాజ్యమేలుతున్నాయి. పూర్తి స్థాయిలో ప్రచారాలు ప్రారంభం కాకపోయినా... ప్రచారానికి కావాల్సినవాటికంటే రెట్టింపు జెండాలను తయారు చేయిస్తున్నాయి ప్రధాన పార్టీలు.

ఇవీ చూడండి:నేతల సందేహాలు నివృత్తి చేసిన రజత్​ కుమార్

Last Updated : Mar 20, 2019, 6:02 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details