ప్రగతిభవన్ వేదికగా కేసీఆర్ పలువురు నేతలను పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన సీఎం, సీఎస్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ రాజకీయ సమావేశాలు నిర్వహించడం లేదని తెరాస లిఖితపూర్వకంగా స్పష్టం చేసినట్లు సీఈఓ గతంలో చెప్పారని మర్రి శశిధర్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ సీఎస్ జోషి ఐటీ నివేదిక విడుదల చేశారని... కేసీఆర్, కేటీఆర్‌కు వచ్చిన అవార్డుల వివరాలు అందులో ఉన్నాయని ఎన్నికల సంఘం దృష్టి తీసుకెళ్లారు. నిబంధనలు ఉల్లంఘించిన సీఎస్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు. జయేష్ రంజన్, ఐటీ అధికారులతో కేటీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారని.. జయేష్ రంజన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎం, సీఎస్‌పై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ - marri shashidhar reddy
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన సీఎం కేసీఆర్, సీఎస్ ఎస్కే జోషిపై చర్యలు తీసుకోవాంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సచివాలయంలో హస్తం పార్టీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
మర్రి శశిధర్ రెడ్డి