భువనగిరి జిల్లాలో పోలింగ్ సామగ్రి పంపిణీ - polling
భువనగిరి లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లు చురుకుగా జరుతున్నాయి. భువనగిరిలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు.
భువనగిరి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌కు సంబంధించిన సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో భువనగిరి, ఇబ్రహీంపట్నం, ఆలేరు, తుంగతుర్తి, జనాగామ, నకిరేకల్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సాయంత్రం వరకు సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు పోలింగ్ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు.