ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నత చదువులే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని... ఏకాగ్రత పట్టుదలతో చదివి పదవ తరగతిలో ప్రథమ శ్రేణిలో మార్కులు సాధించాలని రవీందర్ రెడ్డి సూచించారు.
'ఉన్నత చదువులే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలి' - జెడ్పీ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు
ఆదిలాబాద్ ఇచ్చోడ మండలంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నృత్యాల చేస్తూ ఆకట్టుకున్నారు.
'ఉన్నత చదువులే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలి'
అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సినిమా పాటలకు విద్యార్థులు వేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి:ముగిసిన 'సహకార' నామినేషన్లు