తెలంగాణ

telangana

ETV Bharat / city

మహిళపై దాడి చేసి బావిలో పడిన అడవిపంది - wild pig attacked on woman in adilabad

వ్యవసాయక్షేత్రంలో కూరగాయలు కోస్తున్న మహిళపై అకస్మాత్తుగా అడవి పంది దాడి చేసిన ఘటన ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మండలం లక్కారంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో సాధన గంగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.

Wild boar attack on woman in lakkaram
మహిళపై దాడి చేసి బావిలో పడిన అడవిపంది

By

Published : Jul 16, 2020, 9:07 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లక్కారం గ్రామంలో ఓ మహిళపై అడవి పంది దాడి చేసింది. లక్కారానికి చెందిన సాధన గంగమ్మ వ్యవసాయక్షేత్రంలో బెండకాయలు కోస్తుండగా అకస్మాత్తుగా అడవి పంది దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు గంగమ్మను ఉట్నూర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అడవి పంది దాడి చేస్తున్నప్పుడు.. సమీపంలో ఉన్న కుక్కలు తరిమివేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని వారు తెలిపారు.

కుక్కలు తరమడం వల్ల అడవి పంది ప్రమాదవశాత్తు బావిలో పడింది. గ్రామస్థుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు బావిలో నుంచి అడవిపందిని బయటకు తీశారు. బయటకొచ్చిన కాసేపటికే పంది మృతిచెందగా... ఎఫ్​ఆర్​ఓ అనిత సమక్షంలో పంచనామా నిర్వహించి అటవీప్రాంతంలో పూడ్చివేశారు.

ABOUT THE AUTHOR

...view details