తెలంగాణ

telangana

ETV Bharat / city

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు - weed Smugglers Arreasted By Adilabad Police

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

weed Smugglers Arreasted By Adilabad Police
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు

By

Published : Mar 20, 2020, 9:03 PM IST

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు

అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ.. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. హర్యానాకు చెందిన మూడు కార్లలో 160 కిలోల గంజాయిని స్మగ్లర్లు తరలిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. విశాఖపట్టణం సీలేరు నుంచి హర్యానాకు తరలిస్తున్న గంజాయి తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అంబేద్కర్ కాలనీలో పట్టుకున్నారు.

ఆదిలాబాద్​కు చెందిన షరీపుద్దీన్, హర్యానాకు చెందిన తారీఫ్​ఖాన్​లు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో గంజాయి చేతులు మార్చే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి 160 కిలోల గంజాయి, రూ.2 లక్షల నగదు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించనున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి:ఈ అపార్టుమెంట్‌లోకి కరోనా రాకుండా ఏం చేశారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details