ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు నిండు కుండలా మారాయి. జలపాతాలు జలకళ సంతరించుకుని పాలనురగలతో పరవళ్లు తొక్కుతున్నాయి. రాష్ట్రంలో ఎత్తైన జలపాతంగా పేరొందిన కుంటాల మొదలుకొని పొచ్చర, కనకాయి. సప్త గుండాల జలపాతాల నుంచి గంగ పొంగి పొర్లుతోంది.
అడవుల జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు - pocharla waterfalls in adilabad district
వారం రోజులుగా కురుస్తున్న వానలకు అడవులు జిల్లా తడిసిముద్దయింది. జిల్లాలోని జలపాతాలన్ని జలకళను సంతరిచుకుని పాలనురగలతో పరవళ్లు తొక్కుతున్నాయి.
అడవుల జిల్లాలో పరవళ్లు తొక్కుతోన్న జలపాతాలు
జలపాతాల హొయలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండలు, రాళ్ల మధ్య నుంచి పరవళ్లు పెడుతోన్న జలపాతాన్ని చూడటానికి పర్యటకులు కొలువుదీరారు.