మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ ప్రాంతంలోని డ్రైనేజీలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి ఓ ఇంటి ముందు ఉన్న డ్రైనేజీ వద్ద నీటి సరఫరా ఆగిపోయింది. ఫలితంగా నీరు పైకి పొంగిపొర్లాయి. దీంతో డ్రైనేజీపై ఉన్న బండరాయి తీసిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ ఎస్ఐ మారుతి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
డ్రైనేజీలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం - మంచిర్యాల జిల్లా వార్తలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ ప్రాంతంలోని డ్రైనేజీలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. జిల్లా కేంద్రంలోని ఓ ఇంటి ముందున్న డ్రైనేజీలో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
డ్రైనేజీలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
మృతదేహాన్ని డ్రైనేజీలో నుంచి బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం చుట్టుపక్కల వారిని విచారించారు. అయినప్పటికి ఎలాంటి ఫలితం లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.