తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజధాని బస్సు టైర్​లోంచి పొగలు.. తప్పిన పెను ప్రమాదం

ఆదిలాబాద్​ నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు వెనుక టైర్​ నుంచి పొగలు వచ్చాయి. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించి బస్సును నిర్మల్​కు తరలించడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

Smoke from the bus tire in adilabad
రాజధాని బస్సు టైర్​లో నుంచి పొగలు.. తప్పిన పెను ప్రమాదం

By

Published : Mar 3, 2020, 1:21 PM IST

ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ రాజధాని బస్సుకు.. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఇచ్చోడ గ్రామ సమీపంలోకి రాగానే బస్సు వెనుక టైర్​నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్​.. టైర్​ పేలిపోయే ప్రమాదం ఉందని.. బస్సును నిర్మల్ డిపోకు తరలించారు.

ఎలాంటి ప్రమాదం సంభవించకుండా నిర్మల్​కు బస్సు చేరుకోవడం వల్ల ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ బస్ డిపోలో మెకానిక్ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు దాదాపు గంటకు పైగా డిపోలోనే వేచి ఉండాల్సి వచ్చింది. బస్సుకు మరమ్మతులు చేయడం మరింత ఆలస్యం అవుతుందని నిర్మల్ డిపో నుంచి వేరే బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను హైదరాబాద్ పంపించారు.

రాజధాని బస్సు టైర్​లో నుంచి పొగలు.. తప్పిన పెను ప్రమాదం

ఇదీ చూడండి:కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ABOUT THE AUTHOR

...view details