కరోనా వైరస్ను అరికట్టడానికి దేశంలోని సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రజలు ఆదేశాలు జారీ చేసినా.. కాగజ్ నగర్ సిర్పూర్ మిల్లు మాత్రం కర్ఫ్యూ పాటించలేదు. యథావిధిగా కార్మికులు విధులకు హాజరయ్యారు.
జనతా కర్ఫ్యూ పాటించని సిర్పూర్ పేపర్ మిల్లు! - Sirpur Paper Mill Not following Janatha curfew
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూ పాటించాలని ఆదేశాలు జారీ చేసినా.. కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు మాత్రం కర్ఫ్యూ పాటించకుండా యథావిధిగా నడిచింది.
![జనతా కర్ఫ్యూ పాటించని సిర్పూర్ పేపర్ మిల్లు! Sirpur Paper Mill Not following Janatha curfew](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6505168-423-6505168-1584879813905.jpg)
కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎంలో రెండువేల మంది కార్మికులు జనతా కర్ఫ్యూ రోజు కూడా ఎప్పట్లాగే విధులు నిర్వర్తించడానికి వచ్చారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలంతా నిర్బంధంగా కర్ఫ్యూ పాటించాలని ప్రకటించినా కార్మికులను విధుల్లోకి తీసుకోవడం పట్ల కార్మిక నాయకులు మండిపడుతున్నారు. ప్రమాదకరమైన కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన యాజమాన్యం కనీస జాగ్రత్తలు పాటించకుండా, ప్రభుత్వ ఆదేశాలు ఖాతరు చేయకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు.
ఇదీ చూడండి:జనతా కర్ఫ్యూ'తో ఉత్తర భారతం ఇలా..