మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్‌లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తవ్విన మట్టిని తరలిస్తుండగా మార్గమధ్యంలో వాల్వో వాహనం టైరు పంచర్ అయింది. ఆ వాహనాన్ని రోడ్డు మీద నిలిపివేశారు. వెనకనుంచి వస్తున్న మరో వాల్వో ట్రక్ ఆగి ఉన్న వాహనానికి ఢీకొట్టి వెనుకనున్న ట్రక్ డ్రైవర్ మదన్‌దాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న యాజమాన్యం మృతదేహాన్ని మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించింది. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో చనిపోయిన జార్ఖండ్‌కి చెందిన మదన్దాస్కి రూ.50 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.