Indravelli: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. భూమి కోసం, భుక్తి కోం 1981 ఏప్రిల్ 20న సభ నిర్వహించగా... దానిపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల దాడుల్లో 13 మంది చనిపోయినట్లు అధికారికంగా లెక్క తేల్చారు. అయితే ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని ఆదివాసీలు చెబుతున్నారు. ఆ ఘటన తర్వాత ఇంద్రవెల్లిలో సభ నిర్వహణపై నిషేధం విధించారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించారు.
Indravelli: తుడుం దెబ్బను విచ్ఛిన్నం చేస్తున్నారు: ఎంపీ సోయం బాపురావు - ఎంపీ సోయం బాపురావు తాజా వార్తలు
Indravelli: తెరాస ఎమ్మెల్యేలకు ఆదివాసీలపై ప్రేమ ఉంటే సుప్రీంకోర్టు కొట్టివేసిన జీవో నంబరు 3ను ఆర్డినెన్సు ద్వారా పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం పోరాడతానని ములుగు శాసన సభ్యురాలు సీతక్క స్పష్టం చేశారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమరవీరులకు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు.
తుడుం దెబ్బ ఆధ్వర్యంలో బుధవారం అమరుల స్థూపం వద్ద... బహిరంగసభ ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని ఆదివాసీల నేతల రాకతో ఇంద్రవెల్లి మరోసారి చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, వివిధ జిల్లాలకు చెందిన ఆదివాసీ కీలకనేతలు, మేధావులు తరలివచ్చారు. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి తెరాస కుట్రపన్నుతోందని బాపురావు ఆరోపించారు. కుమురంభీం, సమ్మక్క, సారక్క స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే సీతక్క భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:గుజరాత్‌కు కూడా తెలంగాణ డబ్బులే ఖర్చు పెడుతున్నారు: కేటీఆర్