కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాలు, ఎస్ఎఫ్ఐ నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా పట్టణంలో సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన - తెలంగాణ వార్తలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాలు, ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసనకు దిగారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నినాదాలు చేశారు. ఉద్యమంలో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించారు.
![వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన protest at adilabad and demanding cancellation agricultural acts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9943397-704-9943397-1608449591428.jpg)
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యమంలో అమరులైన వారిని స్మరించుకుని శ్రద్ధాంజలి ఘటించారు. చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని నేతలు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రేసింగ్‌లో విన్యాసాలు చేశారు... పోలీసులు అరెస్ట్ చేశారు