మండుటెండల్లో అడుగు తీసి అడుగు వేయలేని రాళ్ల దారిలో సుమారు రెండు కిలో మీటర్లు నడిచింది ఓ బాలింత. గ్రామంలోకి వాహనం వెళ్లడానికి సరైన రోడ్డు లేకపోవడంతో చంటిపాపతో కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మామిడిగూడ(జి) గ్రామంలో చోటుచేసుకుంది. మెస్రం కవితకు బుధవారం తెల్లవారుజామున పురుటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు రెండు కిలో మీటర్ల దూరంలోని మామిడిగూడ(ఏ) గ్రామానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లిలోని పీహెచ్‌సీకి ఆటోలో తీసుకెళ్లారు.
మన్యంలో ప్రసవ వేదన.. బాలింతకు నరకయాతన - pregnant ladies problems in adilabad
బిడ్డ బోసి నవ్వులు చూసి మురిసిపోయే యోగం మన్యంలోని మారుమూల గ్రామాల గర్భిణులకు దూరం అవుతోంది. కడుపులో నలుసు పడిన క్షణం నుంచి ఆసుపత్రికి వెళ్లడానికి నడుములోతు నీళ్లు, రాళ్లదారులు, మండే ఎండలు, జోరుగా కురిసే వర్షంలో కాలినడకన, ఎండ్లబండ్లలో పయనం సాగించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో మార్గమధ్యలోనే ప్రసవమడం తల్లీ బిడ్డలకు ప్రాణాంతకంగా మారుతోంది. దశాబ్దాలుగా కానరాని రహదారి సౌకర్యం, అడుగడుగునా ఎదురయ్యే అటవీ అడ్డంకులు, అసంపూర్తిగా ఉండే వంతెనల వల్ల మాతా శిశువులు మృత్యుపాలవుతున్నారు.
బాలింతకు కష్టాలు, ఆదిలాబాద్ వార్తలు
ఉదయం 8 గంటలకు పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో కేసీఆర్ కిట్ అందజేసి సుమారు ఒంటిగంట ప్రాంతంలో అంబులెన్స్‌లో ఇంటికి పంపారు. మామిడిగూడ(ఏ) గ్రామం నుంచి వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మండుటెండలో సుమారు 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. తెల్లవారుజామున గ్రామస్థుల సాయంతో రోడ్డు వరకు వచ్చినా తిరిగి పసిపాపతో నడిచే వెళ్లేటప్పుడు అష్టకష్టాలు పడ్డారు.
- ఇదీ చదవండి :'ఫారెస్ట్ వాచర్స్'గా మన్య ప్రాంత మహిళలు