Pilot job for daughter: కూతురికి విమానం నడిపే పైలెట్ ఉద్యోగం రావడంతో ఆనందంతో ఆ తండ్రి తన దగ్గర పని చేసే 15 మంది సిబ్బందిని విమానం ఎక్కించి తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం చేయించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన అజీజ్ హీరాణి మండల కేంద్రంలో కిరాణా దుకాణం నడిపిస్తున్నారు. కూతురు అఫీనా హీరాణి ఉన్నత చదువులు పైలెట్ శిక్షణ పొందారు. పైలెట్ శిక్షణలో రాణించడంతో ఇండిగో విమాన సర్వీసులో కొలువు సాధించారు.
కూతురికి పైలెట్ ఉద్యోగం.. సిబ్బందిని విమానంలో తిరుమలకు తీసుకెళ్లిన తండ్రి - greatness of kirana shop owner
Pilot job for daughter: కూతురికి విమానం నడిపే పైలెట్ ఉద్యోగం రావడంతో ఆనందంతో ఆ తండ్రి తన దగ్గర పని చేసే 15 మంది సిబ్బందిని విమానం ఎక్కించి తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం చేయించారు.
కూతురు పైలెట్ కావడంతో తన కిరాణా దుకాణంలో కూలీలుగా, సిబ్బందిగా పని చేస్తున్న 15 మందిని తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనానికి విమానంలో పంపారు. తన కూతురు ఉన్నతోద్యోగం సాధించడంలో సిబ్బంది, కూలీల శ్రమ సైతం ఉందని అందుకు వారు కోరిన దైవ దర్శనానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అజీజ్ హీరాణి తెలిపారు.
స్వామి దర్శనంతో పాటు హైదరాబాద్‌లోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు తెలిపారు. మా జీవితంలో విమానాన్ని దగ్గరగా చూడలేదని.. అలాంటిది అందులోనే వెళ్లి స్వామిని దర్శించుకునే భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని సిబ్బంది తెలిపారు. పరమత సహనం చూపిన ఆ యజమానిని పలువురు ప్రశంసిస్తున్నారు.