ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో మళ్లీ పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. మండలంలోని కరంజి-టీ అటవీశివారులోని పులిదాడిలో లేగదూడ హతమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనాస్థలాన్ని సందర్శించిన అటవీ అధికారులు పులి దాడిని నిర్ధరించారు.
భీంపూర్‌లో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు - tiger at bhimpur region
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పులి సంచారంతో స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికే కంజి శివారులో ఓ లేగదూడను హతం చేసినట్లు వారు పేర్కొన్నారు. గ్రామాలు, పంటచేల వైపు క్రూరమృగం రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
భీంపూర్‌లో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
మండల సరిహద్దు మహారాష్ట్ర పెన్‌గంగా నదికి ఆనుకుని ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులి ఇటువైపు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పెన్‌గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. పులి నది దాటే పరిస్థితి లేక ఇటువైపే స్థావరం ఏర్పాటు చేసుకుంటుందని స్థానికులు భయపడుతున్నారు. పులి.. గ్రామాలు, పంటచేల వైపు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి:'ఐదు నెలల్లో కేరళ విమాన ప్రమాదంపై నివేదిక'