తెలంగాణ

telangana

ETV Bharat / city

తొమ్మిదో తేదీ.. 9 గంటలకు.. 9 వివాహాలు - అంజి గ్రామంలో పెళ్లి

ఒకే రోజు ఒకే వేదికపై ఒకే సుముహూర్తాన.. అదీ తొమ్మిదో తేదీ, 9 గంటల సమయం, తొమ్మిది జంటల సామూహిక వివాహాలు వైభవంగా జరిగాయి. వేలాది మంది తరలిరావడంతో అంజి గ్రామంలో పెళ్లి సందడి నెలకొంది.

nine weddings on the same stage on the same day at anji village in adilabad district
తొమ్మిదో తేదీ.. 9 గంటలకు.. 9 వివాహాలు

By

Published : Jan 10, 2021, 1:18 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అంజి గ్రామంలో సామూహిక వివాాహాలు వైభవంగా జరిగాయి. తొమ్మిదో తేదీన 9 గంటల సమయాన తొమ్మిది జంటలు ఏకమయ్యాయి. పులాజిబాబా ధ్యాన మందిర్ ఆవరణలో ఆదివాసి ఆంద్​ రాష్ట్ర అధ్యక్షుడు కైలాశ్​, జిల్లా అధ్యక్షుడు విష్ణు.. ఆంద్ సమాజం ఆధ్వర్యంలో వివాహాలను శనివారం ఘనంగా జరిపించారు.

తొమ్మిదో తేదీ.. 9 గంటలకు.. 9 వివాహాలు

జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీభాయి, ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు, మాజీ ఎంపీ రాఠోడ్ రమేశ్​ ఈ వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు, జడ్పీ చైర్మన్ మాట్లాడారు. నిరుపేదలకు వివాహాలు జరిపించి చేయూతనిచ్చిన గ్రామస్థులు, యూత్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ పేద కుటుంబాలను ఆదుకునేందుకు వివాహ సమయంలో రూ.1,00,116 అందిస్తూ.. అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు.

ఇదీ చూడండి:'అడాప్ట్ ఏ పెట్' కార్యక్రమానికి విశేష స్పందన

ABOUT THE AUTHOR

...view details