ఆదిలాబాద్‌లో అద్భుతం.. శివుని గుడిలో పాలు తాగుతున్న నంది..! - Adilabad shiva temple speciality
12:07 March 06
ఆదిలాబాద్‌లో అద్భుతం.. శివుని గుడిలో పాలు తాగుతున్న నంది..!
"అప్పుడప్పుడు వినాయకుడు కూడా పాలు తాగుతాడు.. అప్పుడే ఆయన కూడా ఉన్నాడని భక్తులు గుర్తుపెట్టుకుంటారు" అంటూ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఓ సినిమాలో డైలాగ్ చెప్తాడు. ఆ లాజిక్ ఎంత వరకు నిజమో కానీ.. అలాంటి ఆసక్తికర ఘటనే ఆదిలాబాద్‌లోని తిలక్‌నగర్‌లో ఉన్న శివాలయంలో జరిగింది. ఆలయంలో ఉన్న నంది విగ్రహం పాలు తాగుతోంది.
నంది పాలు తాగడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? నిజమేనండి బాబు.. భక్తులు తీసుకొచ్చిన లీటర్లకొద్ది పాలను నంది అలా పీల్చేస్తుంది. విషయం తెలుసుకున్న స్థానికులు చేతిలో పాల గిన్నెలతో బారులు తీరారు. నందీశునికి పాలు తాగించేందుకు పోటీ పడ్డారు. ఇదంతా దేవుని మహిమే అని నమ్మిన భక్తులు ఓం నమశివాయ అంటూ శివనామస్మరణ చేశారు.
ఇదీ చూడండి: