తెలంగాణ

telangana

ETV Bharat / city

Network Issue: అక్కడ ఫోన్ మాట్లాడాలంటే.. రోడ్డెక్కాల్సిందే! - adilabad district news

ప్రపంచమంతా 5జీ, ఏఐ అంటూ ఆధునిక సాంకేతికతతో ముందుకెళ్తుంటే.. అడవుల జిల్లాలో చాలా గ్రామాలు కనీసం సెల్​ఫోన్ నెట్​వర్క్(Network Issue) లేక వెనుకబడుతున్నాయి. కరోనా వల్ల విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసివేయడం వల్ల ఆన్​లైన్​లో తరగతులు విందామన్నా.. ఇంటి నుంచి ఆఫీస్ వర్క్ చేద్దామన్నా అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

network issue, network issue in adilabad
నెట్​వర్క్ సమస్య, ఆదిలాబాద్​లో నెట్​వర్క్ సమస్య

By

Published : Jun 14, 2021, 9:03 AM IST

ఈ చిత్రంలో ఉన్న వారంతా ఏదో సమావేశం కోసమో.. ఏదైనా చర్చ కోసమో వచ్చి ప్రారంభం కాలేదని ఇలా సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నారనుకుంటే పొరపాటే. ప్రపంచమంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్తుంటే.. ఆదిలాబాద్‌ జిల్లాలోని అనేక గ్రామాలు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌(Network Issue) కూడా అందక బాహ్య ప్రపంచంతో సంబంధాలను కోల్పోతున్నాయి. ప్రతి ప్రభుత్వ పథకానికి సెల్‌ఫోన్‌ నంబరుతో అనుసంధానం చేస్తున్న ప్రస్తుత పరిస్థితిలో సిగ్నల్స్‌ అందక పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని 13 గ్రామాల ప్రజలు సుమారు ఏడు వేల మంది సెల్‌ఫోన్‌ మాట్లాడాలనుకుంటే ఇలా చిఛ్‌దరి ఖానాపూర్‌లోని రోడ్డెక్కాల్సిందే. ఇక్కడ కూడా ఓ ప్రైవేట్‌ కంపెనీకి సంబంధించిన సిగ్నల్స్‌(Network Issue) మాత్రమే వస్తాయి. ఈ పరిస్థితిని చూసే ప్రభుత్వం ఇక్కడ కొన్ని పథకాలకు సంబంధించి సెల్‌ఫోన్‌ నంబరు అనుసంధానం లేకున్నా లబ్ధి కలిగేలా ఉత్తర్వులిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details