నిర్మల్ నియోజకవర్గంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి దసరా నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీతో సమీక్ష నిర్వహించారు.
నియోజకవర్గానికి మొత్తం 3,761 ఇళ్లు మంజూరు కాగా.. అందులో పట్టణంలోని బంగాల్ పేట్, నాగనాయిపేట్లలో 1,460, గ్రామీణ ప్రాంతాల్లో 2,301 కేటాయించినట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటివరకు 2,716 ఇళ్లకు టెండర్లు పూర్తి కాగా, 29 గ్రామాల్లో 1,256 ఇళ్లకు పరిపాలన అనుమతులు పొందాయన్నారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొత్తం ఇళ్ల టెండర్లు వెంటనే పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు.