Minister indrakaran reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభజన తర్వాత ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన నిర్మల్ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో రూ.3. 40 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
పట్టణంలోని చైన్ గేట్ నుంచి పోస్టాఫీస్ వరకు 1.6 కిలోమీటర్ పొడవున 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారి, మిని ట్యాంక్‌బండ్ వద్ద కోటి 40 లక్షలతో చేపట్టనున్న మినీ పార్క్, ఓపెన్ థియేటర్ ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
' ఎన్నో ఏళ్లుగా ఇరుకు రోడ్డులో ప్రజలు ఇబ్బందులు ఎదురుకున్నారు. పాఠశాలల బస్సులు వెళ్లేందుకూ ఇబ్బంది ఎదురయ్యేది. ప్రజల సహకారంతో రోడ్డు వెడల్పు పనులు చేపట్టడం జరుగుతుంది. అలాగే జిల్లా కేంద్రంలోని మిని ట్యాంక్‌బండ్ వద్ద పలు సుందరీకరణ పనులు చేపట్టాము. భవిష్యత్‌లో జిల్లాలోని వైద్యరంగాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాము. రాబోయే రోజులలో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలల నిర్మాణాలు చేపడతాము.'