Man sets his bike on fire Adilabad : ఆదిలాబాద్‌లో తన ద్విచక్రవాహనానికి పోలీసులు తరచూ చలానాలు విధిస్తున్నారని... ఓ వాహనదారుడు బైక్‌ను తగలబెట్టుకున్నాడు. ద్విచక్రవాహనంపై చలాన్లు ఉండగా.. వారం క్రితం వెయ్యి రూపాయలు కట్టినట్లు వాహనాదారుడు తెలిపాడు.
పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన మాక్బూల్.. తరచూ చలానాలు విధిస్తున్నారని ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్‌లోని కిసాన్ చౌక్ చౌరస్తాలో తనిఖీల్లో భాగంగా అధికారులు ఇవాళ మరోసారి పరిశీలించి.. చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో కొంత డబ్బు కట్టాలని అడిగారు. వారం కిందటే చలాను కట్టానని.. మరోసారి ఎక్కడినుంచి డబ్బులు తేవాలంటూ.. వాహనదారుడు అసహనానికి గురై బైక్‌కు నిప్పుపెట్టాడు. ట్రాఫిక్ పోలీసులు నీళ్లు తీసుకొచ్చి మంటలార్పారు. విధుల్లో భాగంగానే జరిమానా విధిస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ ఫణీంద్ర తెలిపారు.
తనిఖీలు చేసేటప్పుడు బండి పేపర్లు ఇవ్వమని అతనిని అడిగాం. లేవు అని చెప్పాడు. వెళ్లి తీసుకురమ్మన్నాం. లేదంటే జరిమానా వేస్తామని చెప్పాం. అంతలోనే బైక్‌ను తగలబెట్టుకున్నాడు. అతనిపై కేసు నమోదు చేశాం. -ఫణీంద్ర, ట్రాఫిక్ సీఐ
అదే చౌరస్తాలో రైతులు ఆందోళన కొనసాగిస్తుండగా .. నడి రోడ్డుపై ఈ ఘటన జరిగింది. సదరు వాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఆదిలాబాద్ కిసాన్ చౌక్‌లో తన బైక్‌కు నిప్పుపెట్టిన వాహనదారుడు ఇవీ చదవండి :
- మద్యం మత్తులో... తన ద్విచక్రవాహనంపై పోలీసులు తరచూ చలాన్లు విధిస్తున్నారని వాహనాన్ని తుగులబెట్టుకున్నాడో యువకుడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో జరిగింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చాలా మంది వాహనదారులు ఈ-చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడం, నంబర్ ప్లేట్‌ను తీసివేయడం, తప్పుడు ప్లేట్‌ను పెట్టుకుని తిరుగుతున్నారని కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాహనాలు గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలను నడిపిన వ్యక్తులను ఈ-చలాన్లు భయపెడుతున్నాయి. పెండింగ్ చలాన్లు(pending challans vehicle seize) ఉన్న వాహనాల్లో ప్రభుత్వ వెహికిల్స్ కూడా ఉండడం గమనార్హం. ఓ కలెక్టర్ వాహనంపై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 28 చలాన్లు ఉన్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చాలా మంది వాహనచోదకులు ఈ-చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడం, నంబర్ ప్లేట్‌ను తీసివేయడం, తప్పుడు ప్లేట్‌ను ఉపయోగించడం, సిగ్నల్ పట్టించుకోకపోడం తదితరాలు చేస్తుండడం చూస్తున్నాం. అలా చలాన్లు కట్టకుండా తప్పించుకొని తిరురుగుతున్న ద్విచక్ర వాహన దారుడు మహ్మద్ ఫరిద్ ఖాన్ చివరికి ఇలా చిక్కాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వాహనం వేగంగా నడిపినా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా సాధారణంగా చలాన్లు విధిస్తారు. సాధారణ పౌరులు నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లు విధించడం పరిపాటే. కానీ ఓ అధికారి వాహనమే రూల్స్ పాటించకపోతే ఏం చేస్తారు? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి