పెద్దపులి దాడిలో యువకుడు మృతి.. భయాందోళనలో స్థానికులు - కుమురం భీం జిల్లా వార్తలు
14:51 November 11
పెద్దపులి దాడిలో యువకుడు మృతి.. భయాందోళనలో స్థానికులు
కుమురంభీం జిల్లా దహేగాంలో పెద్దపులి దాడిలో యువకుడు మృతి చెందాడు. దిగెడ గ్రామం వద్ద పశువుల మేతకు వెళ్లిన విఘ్నేశ్(22)పై పెద్దపులి దాడి చేసింది. అతడిని సమీప అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. విఘ్నేశ్‌పై పెద్దపులి దాడిని చూసిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.
స్థానికుల హడావుడితో పెద్దపులి విఘ్నేశ్ మృతదేహాన్ని అక్కడే వదిలివెళ్లింది. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. దాడి జరిగిన క్రమం, పెద్దపులి జాడపై ఆరా తీస్తున్నారు.
ఇవీ చూడండి: ప్రియుడి కిడ్నాప్‌కు ప్రియురాలు యత్నం.. యువకుడి తండ్రి మృతి