తెలంగాణ

telangana

ETV Bharat / city

చిరుత పులుల సంచారం... భయాందోళనలో గ్రామస్థులు... - సారంగపూర్​లో చిరుతల సంచారం

Leopards Commotion: నిర్మల్ జిల్లాలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి పొలానికి కాపలాగా ఉన్న ఓ రైతు మూడు చిరుతలను చూసి ఆందోళనకు గురయ్యాడు. పులుల సంచారంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Leopards Commotion
Leopards Commotion

By

Published : Mar 30, 2022, 7:49 PM IST

Leopards Commotion: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామ శివారులో చిరుత పులుల సంచారం అలజడి రేపుతోంది. అర్ధరాత్రి పొలానికి కాపలాగా ఉన్న రైతు మూడు చిరుతలను చూసి ఆందోళన చెందాడు.

అర్ధరాత్రి పొలంలో చిరుతలు

వెంటనే గ్రామస్థులను అప్రమత్తం చేయడంతో దాదాపు 40 మంది అక్కడికి చేరుకొని అరిచారు. దీంతో ఆ చిరుత పులులు అటవీ ప్రాంతం వైపు పారిపోయాయి. ప్రస్తుతం అవి వెళ్లినప్పటికీ మళ్లీ ఎప్పుడు వస్తాయోనని జనంలో ఆందోళన నెలకొంది. మళ్లీ పంటపొలాల దగ్గర కాపలా ఉన్న వారిపై దాడి చేస్తే పరిస్థితి ఏంటని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఇదీ చదవండి:కరీంనగర్‌లో వీధివ్యాపారుల కోసం వెండింగ్ జోన్లు

ABOUT THE AUTHOR

...view details