వ్యవసాయంలో ఆశించిన లాభాలు రాకపోయినా.. రైతులు ఏనాడు సాగును విడిచిపెట్టలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భారీగా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినా.. దిగుబడులు రాక అన్నదాతలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే నూతన సాగు చట్టాలు'
రైతుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చి, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం నూతన వ్యవసాయ చట్టం తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైతులు బాగుపడాలనేదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ రైతులకు సాగుచట్టాలపై అవగాహన
ఆదిలాబాద్‌లో జరిగిన రైతు అవగాహన సదస్సులో పాల్గొన్న కిషన్‌రెడ్డి.. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. అన్నదాతల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా.. ప్రధాని మోదీ సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. రైతులు ఎక్కడ అధిక ధరలు ఉంటే అక్కడే పంటను అమ్ముకునే విధంగా చట్టాలను రూపొందించారని వివరించారు.