సచివాలయంలో కూల్చివేసిన మసీదులు, దేవాలయాల నిర్మాణంపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని ఆదిలాబాద్ కలెక్టర్ కార్యలయం ఎదుట జమతే ఉల్మా ఏ హింద్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్లాకార్డులు ప్రదర్శిస్తూ... ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. సచివాలయంలో కూల్చివేసిన రెండు దేవాలయాలపై సీఎం కేసీఆర్ త్వరగా స్పష్టత ఇవ్వాలని జమతే ఉల్మా ఏ హింద్ సభ్యులు డిమాండ్ చేశారు.
'కూల్చేసిన మసీదులు, దేవాలయాల నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలి'
ఆదిలాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయం ముందు జమతే ఉల్మా ఏ హింద్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సచివాలయంలో కూల్చేసిన మసీదులు, దేవాలయాల నిర్మాణంపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
jamate ulma a hindh protested in adilabad
ప్రజల్లో ఉన్న సందేహాలను తీర్చాలన్నారు. ప్రార్థనలు మాత్రమే కాదు... కూల్చివేత సందర్భంలో మత పెద్దలను సంప్రదించకపోవడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జమతే ఉల్మా ఏ హింద్ సభ్యులు హఫీజ్ అబూబకర్, హఫీజ్ మంజూర్, మౌలానా అసాలం, ముఫ్తీ ముస్తఫా, మౌలానా ఖామర్ తదితరులు పాల్గొన్నారు.