తెలంగాణ

telangana

ETV Bharat / city

'విద్యుత్‌ ఉద్యోగుల భద్రత కోసం మరో ఉద్యమానికైనా సిద్ధమే' - intuc updates

ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా విద్యుత్‌ ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో ఐఎన్‌టీయూసీ అనుబంధ విద్యుత్ ఉద్యోగుల యూనియన్​ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ శ్రీధర్‌ పాల్గొన్నారు. కాంట్రాక్ట్​ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించారే తప్ప సమాన వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి కనబరుస్తోందని ఆరోపించారు.

intuc affiliated electricity employees union secretary general on employees problems in adilabad
'విద్యుత్‌ ఉద్యోగుల భద్రత కోసం మరో ఉద్యమానికైనా సిద్ధమే'

By

Published : Oct 8, 2020, 1:59 PM IST

రాష్ట్రంలో విద్యుత్‌ కార్మికుల ఉద్యోగ భద్రత కోసం అవసరమైతే మరో ఉద్యమానికైనా సిద్ధమేనని ఐఎన్‌టీయూసీ అనుబంధ విద్యుత్​ ఉద్యోగుల యూనియన్​ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ శ్రీధర్‌ అన్నారు. ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా విద్యుత్‌ ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్​ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించారే తప్ప... సమాన వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఉద్యమానికీ వెనకాడబోమని హెచ్చరించారు.

ఇదీ చూడండి:ఓరుగల్లు జిల్లాలో లెక్కల్లో లేని ఆస్తులు ఇవీ...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details