ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతం అయినప్పటికీ వర్షం రాకపోవటం వల్ల ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రెండు గంటలపాటు కురవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఆదిలాబాద్లో కుండపోత వర్షం... సేదతీరిన జనం - Heavy Rain in Adilabad
ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆదిలాబాద్ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. అల్పపీడనం కారణంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీనివల్ల పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్లో కుండపోత వర్షం... సేదదీరిన జనం
ఆదిలాబాద్ పట్టణంతో పాటు జైనత్, బేలా, గుడిహత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్ తదితర మండలాల్లో వర్షం కురిసింది.వరుణుడి రాకతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిన పట్టణ ప్రజలకు ఉపశమనం కలిగింది.