తెలంగాణ

telangana

ETV Bharat / city

తాటికాయంతా వంకాయలు.. ఒక్కోటి అరకిలో పైనే.. - అరకిలో బరువుతో వంకాయలు

Half kG WEIGHING BRINJAL: తాజా కూరలలో రాజా ఎవరండీ.. ఇంకా చెప్పాలా వంకాయేనండీ.. అని పాటలు పాడుతూ మరీ వంకాయ రుచిని ఆస్వాదిస్తాం. మనకెంతో సుపరిచితమైన ఆ కూరగాయ ఓ రైతు ఇంటి పెరటిలో టెంకాయలు, తాటికాయల్లా పెరిగి చూపరులను ఆకట్టుకుంటోంది. ఒక్కోటి అరకిలో పైనే బరువున్నాయంటే నమ్ముతారా! అయితే ఇది చదివాల్సిందే...

BRINJAL
తాటికాయంతా వంకాయలు

By

Published : Mar 17, 2022, 6:17 PM IST

Half kG WEIGHING BRINJAL: నల్ల వంకాయలు, పొడవు వంకాయలు, ఆకుపచ్చ వంకాయలు, ముళ్ల వంకాయలు ఇలాంటి పలు రకాలను మార్కెట్​లో చూస్తుంటాం. ఏదో ఒక రకాన్ని అరకిలో తెచ్చుకుని వండుకుంటే ఒక పూటకి సరిపోతుందనుకుంటాం... కానీ ఈ వంకాయలు టెంకాయ, తాటికాయల్లా పెరిగి ఒక్కటే అరకిలోకు పైగా బరువు తూగుతూ చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

కుమురం భీం జిల్లా పెంచికల్​పేట్ మండలం బొంబాయిగూడ గ్రామానికి చెందిన మాధవి పెరట్లో పది వరకు వంకాయ మొక్కలను నాటింది. కాసే ఒక్కో వంకాయ అరకిలో పైనే బరువు తూగుతున్నాయన్నారు.

కాగజ్ నగర్ మార్కెట్లో వంగ కొనుగోలు చేసి నాటామని.. కాసిన అన్ని కాయలు ఇదే స్థాయిలో ఉన్నాయని ఆ ఇంటి గృహిణి తెలిపారు. విత్తన రకం, నేల స్వభావం ఆధారంగా ఇలా పెరుగుతాయని ఉద్యానవన అధికారి నజీర్ తెలిపారు. వంకాయలు పెరిగిన తీరును చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇంటి పెరటిలో పెరిగిన తాటికాయంతా వంకాయలు

ఇదీ చదవండి:'సమస్యలు పరిష్కరించే వరకు కదలం.. హోలీ పండుగ ఇక్కడే చేసుకుంటం'

ABOUT THE AUTHOR

...view details