తెలంగాణ

telangana

ETV Bharat / city

ఘనంగా పొలాల అమావాస్య.. మొక్కులు చెల్లించుకున్న అన్నదాతలు - నిజామాబాద్​లో పొలాల అమావాస్య వేడుకలు

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలో పొలాల అమావాస్య పండుగను.. అన్నదాతలు ఘనంగా నిర్వహించారు. ఎద్దులకు చక్కగా అలంకరించి గ్రామాల్లో ఉన్న ఆలయాల చుట్టూ ప్రదక్షణలు చేయించారు.

grand celebrations of polala fest at adilabad
ఘనంగా పొలాల అమావాస్య.. మొక్కులు చెల్లించుకున్న అన్నదాతలు

By

Published : Aug 19, 2020, 4:41 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలో పొలాల అమావాస్య పండుగను.. రైతులు సంబురంగా నిర్వహించారు. పంట సాగులో వెన్నుదన్నుగా నిలిచే బసవన్నలను... దైవాలుగా భావించి శ్రావణ మాస ముగింపు అమావాస్య రోజున... ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉట్నూర్, ఇంద్రవెల్లి గాదిగూడ ప్రాంతాల్లో... మారుమూల గ్రామాల సైతం పొలాల పండుగను రైతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో... నిజామాబాద్ జిల్లాలో బోధన్ నియోజకవర్గంలో ఈ పొలాల అమావాస్యను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. సదాశివనగర్ మండలం భూంపల్లిలో... ఎడ్లపొలాల అమావాస్య సందర్భంగా... ఎద్దులకు చక్కగా అలంకరించి... శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పిట్లం మండలాల్లో... రైతులు తమ ఎడ్లను అందంగా అలంకరించారు. వాటికి దుస్తులు వేసి అలంకరించారు. గ్రామాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాల చుట్టూ తిప్పారు. ప్రధాన వీధుల గుండా ఎద్దులతో ర్యాలీ నిర్వహించారు. కరోనా నేపథ్యంలోనూ... పలు చోట్ల రైతులు పొలాల పండుగను కోలాహలంగా నిర్వహించుకున్నారు.

ఇవీచూడండి:ఆ కుటుంబంతో హార్న్​బిల్ 'అరుదైన స్నేహం'

ABOUT THE AUTHOR

...view details