తెలంగాణ

telangana

ETV Bharat / city

అభివృద్ధిలోనూ ముందుకు తీసుకెళ్లాలి: ప్రభుత్వ విప్ కర్నె - ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో కర్నె ప్రభాకర్​ జెండా ఆవిష్కరణ

ఆదిలాబాద్​ జిల్లావ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు. కలెక్టరేట్​లో ప్రభుత్వ విప్​ కర్నె ప్రభాకర్​ జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వ, పార్టీ కార్యాలయాలు, పాఠశాల్లో ఉత్సవాలు నిర్వహించారు.

government whip karne prabhakar flag hosted in adilabad collectorate
అభివృద్ధిలోనూ ముందుకు తీసుకెళ్లాలి: ప్రభుత్వ విప్ కర్నె

By

Published : Aug 15, 2020, 1:59 PM IST

అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధిలోనూ ముందుకు తీసుకెళ్లడానికి అధికార యంత్రాంగం అంకితభావంతో పనిచేయాలని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ సూచించారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా... కలెక్టరేట్​లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఉమ్మడి రాష్ట్రంలో విషజ్వరాలతో తల్లడిల్లిన ఆదిలాబాద్‌ను... అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో స్వాతంత్య్ర వేడుకులు నిరాడంబరంగా జరుపుకున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉత్సవాలు జరుపుకున్నారు. తెరాస కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న, ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా పోలీస్ స్టేషన్​లో డీఎస్​పీ ఉదయ్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనుల అభివృద్ధి కోసం ఉట్నూర్​ ఐటీడీఏ పీవో అన్నారు.

ఏజెన్సీ ప్రాంతం గిరిజనుల అభివృద్ధి కోసం ఐటిడిఎ ఉట్నూర్ కృషి చేస్తుందని తెలిపారు . ఉట్నూర్ డిఎస్పి ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కాలంలో కూడా పోలీసులు మనం అందరం కలిసి ఈ విధంగా ప్రజల్లో నుంచి కాపాడేందుకు క్షమించమని పేర్కొన్నారు .మనతో పాటు మన కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని తెలిపారు. స్వాతంత్ర వేడుకలు మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జెండాను ఆవిష్కరించారు.

ABOUT THE AUTHOR

...view details